రాజోలు జనసేన ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు

రాజోలు నియోజకవర్గం: మలికిపురం జనసేన పార్టీ మండల అధ్యక్షులు మళ్ళిపూడి సత్తిబాబు అధ్యక్షతన గ్రామ శాఖ బోల్లం ప్రసాద్ అధ్వర్యంలో ప్రధాన కూడలి గాంధీ బొమ్మల సెంటర్ లో 133వ ఫూలే వర్ధంతి మంగళవారం ఘనంగా నిర్వహించారు. తొలుత జనసేన పార్టీ సమాన్వయ కర్త గుండుబోగుల పెద్దకాపు ఫూలే చిత్రపటానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆధునిక భారత దేశంలో సామాజిక విప్లవానికి అంకురార్పణ చేశారన్నారు. ఫూలే దంపతులు నిమ్నజాతుల అభ్యున్నతి కోసం, స్త్రీ సాధికారత కోసం తుది శ్వాస వరకూ పోరాడిన త్యాగమూర్తులన్నారు. నిచ్చెనమెట్ల కులవ్యవస్థకు, ఛాందస ఆచార కట్టుబాట్లకు వ్యతిరేకంగా ఉద్యమించి, కుల, మత, వర్గ, లింగ రహిత సమతా రాజ్య స్థాపన కోసం నిరంతరం కఠోరంగా శ్రమించిన పూలే దంపతులు నేటి సమాజానికి ఆదర్శప్రాయులన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గెడ్డం మహాలక్ష్మీ ప్రసాద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాడి మోహన్ కుమార్, జిల్లా కార్యదర్శి గుండబత్తుల తాతాజీ, మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, సూరిశెట్టి శ్రీనివాస్ ఎంపీపీ మెడిచర్ల సత్యవాణి రాము, డాక్టర్ రాపాక రమేష్ బాబు, గొల్లమందల పూర్ణ భాస్కర రావు, మత్తి జయప్రకాష్,అల్లూరి రంగరాజు, రావూరి నాగు, ఉండపల్లి అంజి, సర్పంచ్ కాకార శ్రీనివాస్, ఎంపీటీసీ జక్కంపూడి శ్రీదేవి శ్రీనివాస్, బైర నాగరాజు, ఆవుపాటి శివ జ్యోతి సుబ్రమణ్యం, కార్యదర్శులు నల్లి పవన్ ప్రసాద్, జిల్లెళ్ల రాక్షక్, ఉపాధ్యక్షులు గునిసెట్టి రాంజీ, రేపూరి వాసు, మలే కాళిదాస్, కొనతం నరసింహరావు, ఎస్ కె మీరాజ్ , నిమ్మగడ్డ వేంకటేశ్వర రావు, ఓదురి రాజా, సాధనాల విజయ్, పవన్ తేజ, పోలిశెట్టి గణేష్, బందెల చరత్, పెండ్ర శ్రీను, అడబాల శ్రీను, రాహుల్ గాంధీ, శ్రీను, వీర మహిళలు అంజలి, శాంతి, వరలక్ష్మి, సుజాత, నాగమణి, సత్య జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.