విసినిగిరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మెగా పవర్ స్టార్ పుట్టినరోజు వేడుకలు

చీపురుపల్లి నియోజకవర్గం: మెగాస్టార్ చిరంజీవి ముద్దుల తనయుడు పవన్ కళ్యాణ్ ముద్దు బిడ్డ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ చీపురుపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మెగా పవర్ స్టార్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అనంతరం స్థానిక బాపూజీ వృద్ధాశ్రమంలో గల వృద్ధులకు పళ్ళు, రొట్టెలు పంపిణీ చేసి, కేక్ కటింగ్ చేయించి రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక జనసేన నాయకులు సిడగం రామచంద్ర రావు, జనసేన శంకర్ జడ్డు ఆదినారాయణ, డబ్బాడ అచ్చం నాయుడు, తెలుగుదేశం నాయకులు వెంకట్రావు, రామారావు, విద్యా వేత్త అప్పలనాయుడు పాల్గొనడం జరిగింది.