జనసేనాని పుట్టినరోజు వరకు గడువిచ్చిన బొబ్బిలి జనసేన

బొబ్బిలి, రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఫ్యాన్లు లేక ప్రయాణీకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం ఇదివరకు సాలూరు డిపోలో చెప్పడం జరిగింది కాని స్పందించటం లేదు. సెప్టెంబర్ 2 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వరకు అధికార యంత్రాంగానికి గడువు ఇస్తున్నామని, ఈలోగా అవసరం అయినటువంటి ఫ్యాన్లు బిగించి ప్రయాణీకులకు సౌకర్యం కలిపించకపోతే జనసేన పార్టీ అధ్యక్షులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా జనసేన పార్టీ తరఫున జనసైనికులందరు అక్కడ ఫ్యాన్లు బిగించి ప్రయాణీకులకు సౌకర్యం కల్పిస్తామని బొబ్బిలి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మహంతి ధనంజయ తెలిపారు.