మానవత్వం చాటుకున్న బొలిశెట్టి హెల్పింగ్ హ్యాండ్స్, దర్శిపర్రు జనసేన

తాడేపల్లిగూడెం, బిల్లగుంట గ్రామంలో కూలి చేసుకొని బ్రతికే మోర్తా రాజేష్ 35 సంవత్సరం వయసు మక్కి భాగంలో వుండే బాల్ అరిగిపోయి చుట్టూ ఇన్ఫెక్షన్ అయ్యి ఎన్ని హాస్పిటల్ కి తిరిగినా మేజర్ ఆపరేషన్ కాబట్టి 2 లక్షల రూపాయల పెట్టుకునే ఆర్ధిక శక్తిలేక చాలా నరకం చూసిన కష్టానికి జనసేన సహాయం అందించడం జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పెంటపాడు మండల బిల్లగుంట గ్రామానికి చెందిన రాజేష్ అనే వ్యక్తికి బొలిశెట్టి హెల్పింగ్ హ్యాండ్స్, దర్శిపర్రు జనసేన చేసిన మానవత్వంతో సహాయం చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం సాయివెన్నెల హాస్పిటల్ లో బొలిశెట్టి శ్రీనివాస్ మాటతో, డా. చిన్ని కుమార్ సహృదయ హస్తాలతో, పట్టణ అధ్యకులు వర్తనపల్లి కాశీ సహకారంతో మరియు జనసేన నాయకులు, జనసైనికుల సహకారంతో సహాయం అందచేశారు. ఈ కర్యక్రమంలో జనసేన నాయకులు, జనసేన వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.