కావలిలో భీమ్లా నాయక్ టికెట్ల వివాదం

కావలి నియోజకవర్గంలో భీమ్లా నాయక్ మూవీ టికెట్స్ వైసీపి నాయకులు వారి అధికారం ఉపయోగించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు, జనసేన నాయకులకు టికెట్స్ అందనీయకుండా చేస్తున్నారని ఫలితంగా కావలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ పై కక్ష సాధింపు చర్యలకు వైసీపీ ప్రభుత్వం పాల్పడుతోంది, ఆయనను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక, ఆర్థికంగా దెబ్బ తీయాలనే ఉద్దేశంతో చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.