వర్తనపల్లి కాశీని సత్కరించిన బొలిశెట్టి

తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా బి సి సంక్షేమ సంఘం అధ్యక్షుడుగా వర్తనపల్లి కాశీని ఏకగ్రీవంగా మళ్ళీ ఎన్నికైన సందర్భంగా జనసేన తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ ఆఫీస్ కి ఆహ్వానించి వారిని వారి మిత్ర బృందానికి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి వర్తనపల్లి కాశీ, రానున్న రోజుల్లో మరింత జిల్లాలో బలపడి కష్టపడి ఉన్నతమైన స్థానంలో ఉండాలని కొరుకుతున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిసి సంక్షేమ సంఘం తాడేపల్లిగూడెం నియోజకవర్గ అధ్యక్షుడు కేశవభట్ల విజయ్, తాడేపల్లిగూడెం యువజన ప్రధాన కార్యదర్శి చిన్న, జిల్లా ఉపాధ్యక్షులు నరసింహ మూర్తి, పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, తాడేపల్లిగూడెం నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు మూర్తి, జనసేన గౌరవ అధ్యక్షులు ఆడబాల నారాయణమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి యంట్రపాటి రాజు, జిల్లా ఉపాధ్యక్షులు రాంశెట్టీ సురేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి గుండుమోగుల సురేష్, నలకంచి రాంబాబు, సోషల్ మీడియా ఇంచార్జీ ముఖేష్, పెంటపాడు మండల అధ్యక్షుడు పుల్లా బాబి, మాదాసు ఇందు, సొమలమ్మ, భాస్కర్ రావు, ధర్మేంద్ర, సతీష్ మరియు బిసి సంక్షేమ సంఘం నాయకులు జనసేన నాయకులు పాల్గొన్నారు.