అభివృద్ధి చేయటం చేతకాక పవన్ పై ఏడుపు: తోట లక్ష్మీ నారాయణ

  • అనుపాలెం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు తోట లక్ష్మీ నారాయణ

సత్తెనపల్లి నియోజకవర్గం: రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం చేతకాక.. పవన్ కళ్యాణ్ మీదపడి ఏడవడం దేనికని జనసేన అనుపాలెం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు తోట లక్ష్మీ నారాయణ ప్రశ్నించారు. ఆదివారం ఆయన పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ వైసిపి నాయకులు పొత్తుల గురించి మాట్లాడటమే. కాకుండా వాటి గురించి భయ పడుతున్నారు. ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది.. మేము 175 సీట్లకు పోటీ చేస్తామో.. లేక 25 ఎంపి సీట్లకు పోటీ చేస్తామో.. మీకెందుకు.. అది మా పార్టీకి, ప్రజలకు సంబం ధించిన విషయం. సొల్లు కూతలు మాని రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించండి.. అంటూ విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ సభలకు వచ్చే ప్రజలను చూసి, ప్రజల్లో పవన్ కళ్యాణ్ కు వస్తున్నా ఆదరణ చూసి వైసీపీ నాయ కులు భయపడుతున్నారని అన్నారు. రూపాయి ఇచ్చి 100 రూపాయలు లాక్కోవడం వైసీపీ ప్రభుత్వానికే చెల్లుతుందని అన్నారు. రాష్ట్రంలో అన్ని నిత్యావసర సరుకుల ధరలు, కరెంట్ చార్జీలు, బస్సు చార్జీలు పెంచి ప్ర జల నడ్డి విరిచారని అన్నారు. ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు యువత తరలిపోతున్నా రన్నారు. కనీసం 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించలేని మీరు పవన్ కళ్యాణ్ మీద పడి ఏడవడం దేనికి.. అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రాభివృద్ధికి మీరేంచేశారో చెప్పాలి. అప్పులు చేసినొక్కడం తప్ప మీరు చేసింది ఏమీ లేదని, ఏ ఒక్క సామాజిక వర్గానికి ఈ నాలుగేళ్ళ కాలంలో మీ పాలనలో జరిగిన న్యాయం ఏమిటో చెప్పాలి. మీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. రానున్న ఎన్నికల్లో వైసిపికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు.