దర్శిపర్రు గ్రామ ప్రజలను అభినందించిన బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలం, దర్శిపర్రు గ్రామంలో గత 40 ఏళ్ళుగా ప్రజలకు ఉపయోగం లేకుండా ఉన్న మంచినీటి చెరువును దర్శిపర్రు గ్రామ ప్రజలు, జనసైనికులు, జనసేన నాయకులు, జనసేన సర్పంచ్ ఆధ్వర్యంలో సొంత ఖర్చులతో బాగుచేసుకుంటున్న మంచి కార్యక్రమన్ని తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.