ఎన్‌టీఆర్‌ సరసన బాలీవుడ్ భామ..?

ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ చేస్తున్నాడు. ఇది పూర్తీ కాగానే త్రివిక్రమ్ డైరెక్షన్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటించనున్నాడు. ప్రస్తుతం ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా..హీరోయిన్ కు సంబందించిన అనేక వార్తలు ఇప్పటికే ప్రచారం కాగా..తాజాగా మరో హీరోయిన్ పేరు తెగ చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమాలో “మున్ని బదనాం హూయి’ ఫేమ్ వరీనా హుస్సేన్ ను ఒక కథానాయికగా అనుకుంటున్నారట. అందుకే ఈమెను హైదరాబాద్ కు వచ్చిందని , ఆమెతో టెస్ట్ షూట్ చేయిస్తున్నారని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ఇద్దరు లేదా ముగ్గురు కథానాయికలకు ఛాన్స్ ఉంది అని అంటున్నారు. ఒక పాత్రకు ఆమెను ఎంపిక చేశారా లేదా అనే విషయంపై క్లారిటీ రావాలి.