గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన దేత్తడి హారిక..

తెలుగు బిగ్‌బాస్‌4  షోలో చివరి వరకు పోటీనిచ్చిన యూట్యూబ్‌ స్టార్‌ దేత్తడి హారిక గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించారు. రాజ్యసభ్య సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బిగ్‌బాస్‌ 4 విన్నర్‌ అభిజిత్‌ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన హారిక సోమవారం జూబ్లీహిల్స్‌లోని పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హారిక మాట్లాడుతూ.. ‘గతంలోనూ నేను గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాను. ఇప్పుడు రెండోసారి మొక్కలు నాటుతుండడం ఆనందంగా ఉంది. వాతావరణ కాలుష్యం తగ్గించేందుకుగాను గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ గారికి నా అభినందనలు. ఈ ఛాలెంజ్‌ ఇదే విధంగా ముందుకు కొనసాగాలని’ కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. ఇక నటుడు నోయెల్‌ సేన్‌, బిగ్‌బాస్‌2 ఫేం దీప్తి సునైనాలను మొక్కలు నాటాలని హారిక ఛాలెంజ్‌ విసిరారు.