అంగన్ వాడీ వర్కర్ల దీక్షకు బొమ్మిడి నాయకర్ మద్దతు

నరసాపురం: మొగల్తూరు మరియు నరసాపురంలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అండ్ వర్కర్స్ వారి సమస్యలు తీర్చమని చేస్తున్న 3వ రోజు ధర్నాలో వారిని కలిసి వారి సమస్యలు తెలుసుకుని ఆ సమస్యల్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్లి వాటిని పరిష్కరించే విధంగా ముందుకు తీసుకువెళ్తాము అని వారికి హామీ ఇచ్చిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్. ఈ కార్యక్రమంలో నరసాపురం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ పొత్తూరి రామరాజు, మాజీ శాసన మండలి చైర్మన్ ఎం.ఏ షరీఫ్ మరియు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.