అంగరంగ వైభవంగా బొమ్మిడి నాయకర్ జన్మదిన వేడుకలు

నరసాపురం, శుక్రవారంనరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు, రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ మరియు రాష్ట్ర జనసేన – టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు బొమ్మిడి నాయకర్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, నియోజకవర్గ ఇన్చార్జిలు మరియు పీఏసీ సభ్యులు చేగొండి సూర్యప్రకాష్, కనకరాజు సూరి, రెడ్డి అప్పల నాయుడు, పితాని బాలకృష్ణ, విడివాడ రామచంద్రరావు, పత్సమట్ల ధర్మరాజు, జుత్తుగ నాగరాజు, లోకం మాధవి, మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ శాసనమండలి సభాపతి యం ఏ షరీఫ్, పొత్తూరి రామరాజు, కొవ్వలి యతిరాజా రామమోహన నాయుడు మరియు రాష్ట్ర మరియు నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.