పాత అన్న సముద్రం జనసేన ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

ప్రకాశం జిల్లా, త్రిపురాంతకం మండలం, పాత అన్న సముద్రం జనసైనికుల అధ్వర్యంలో పాత అన్న సముద్రం జనసేన ఆఫీస్ నందు 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి పాతకోటి వెంకట సుబ్బారావు విచ్చేసారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం జరిగింది.