పలు కుటుంబాలను పరామర్శించిన బొంతు రాజేశ్వరరావు

  • తాడి మోహన్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించిన బొంతు రాజేశ్వరరావు

రాజోలు నియోజవర్గం, మలికిపురం మండలం, గూడపల్లి గ్రామంలో జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తాడి మోహన్ కుమార్ అమ్మమ్మ శ్రీమతి పోతుల సుభద్రమ్మ కాలం చేశారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, గెడ్డం వసంతరావు దొమ్మేటి సత్యనారాయణ, మందపాటి సత్తిబాబు, బందెల శరత్ రాయ్, తదితరులు.

  • తోరం గంగారావు కుటుంబ సభ్యులను పరామర్శించిన బొంతు రాజేశ్వరరావు

రాజోలు నియోజవర్గం, మలికిపురం మండలం, గూడపల్లి గ్రామంలో తోరం గంగారావు కాలం చేశారు. వారి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, గెడ్డం వసంతరావు, దొమ్మేటి సత్యనారాయణ, మందపాటి సత్తిబాబు తదితరులు.

  • అడ్డాల చిన్న బాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన బొంతు రాజేశ్వరరావు

రాజోలు నియోజవర్గం, మలికిపురం మండలం, పడమటిపాలెం గ్రామంలో అడ్డాల చిన్న బాబు కుమారుడు వినోద్ అకాల మరణం చెందినారు. చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు.