బూత్ కమిటీలు వేసి ఎన్నికలకు సిద్ధం కావాలి

  • నియోజకవర్గ ఇన్చార్జిలకు దిశ నిర్దేశం

హైదరాబాద్: జూబ్లీహిల్స్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం నియోజకవర్గ ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి తెలంగాణలో 32 నియోజకవర్గాలలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని పోటీ చేసే నియోజకవర్గాలలో బూత్ కమిటీలు వేసి పోటీకి సిద్ధం కావాలని ఇన్చార్జిలకు తెలియజేశారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటి ఇంటికి క్షేత్రస్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలపైన పోరాడుతూ జనసేన గలమెత్తి ప్రజల పక్షాన గట్టిగా నిలబడాలని ఇన్చార్జ్ లకు తెలియపరచారు. నియోజకవర్గాల ఇన్చార్జిలు మాట్లాడుతూ నియోజకవర్గాలలో ఉన్నటువంటి పరిణామాలను పార్టీ నాయకత్వానికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ సభ్యులు, దామోదర్ రెడ్డి, సురేష్ రెడ్డి తాడికొండ లికిత, శ్రీమతి రత్న పిల్ల, 23 నియోజకవర్గాల ఇన్చార్జులు పాల్గొన్నారు.