సత్తెనపల్లి నియోజకవర్గంలో అలుపెరగని పోరాటం చేస్తున్న బొర్రా

సత్తెనపల్లి: వందలాదిగా నడవడానికి అనుమతి కావాలి. ఒక్కడు నడవడానికి కూడా అనుమతి కావాలా? అంటూ ఎక్కడ పాదయాత్రని పోలీసులు భగ్నం చేశారో అక్కడ నుండే ఒక్కడే పాదయాత్ర మొదలు పెట్టిన సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు. పెదమక్కెన నుండి ఒంటరిగా సంకల్ప యాత్ర మొదలు పెట్టిన బొర్రా అడుగడుగునా పోలీసుల ఆటంకాల మధ్య కొనసాగిన బొర్రా సంకల్ప పాదయాత్ర. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు సమస్యలపై పోరాడుతున్న విపక్షాలపై ప్రభుత్వ కక్ష సాధింపు తగదు, విపక్షాల పాదయాత్రలను అడ్డుకోడు హేయమైన చర్య, ప్రజా సమస్యలను తీర్చడం చేతగాని అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీలను అణిచివేసే ధోరణిని ఖండిస్తున్నాం. అభివృద్ధి చేయడం చేతగాని ప్రభుత్వం ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, వారికి ఆటంకం కలిగిద్దామనే అనే అంశం మీదే దృష్టి పెడుతున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాల కృష్ణయ్య స్ఫూర్తితో ముందుకు వెళుతున్నామన్న బొర్రా. అధికారం కోల్పోతే ఎక్కడ నుండి వచ్చారు అక్కడికి వెళ్లిపోతారని, స్థానికులమైన మాకు అడుగడుగున ఆటంకాలు సృష్టించిన స్థానిక ఎమ్మెల్యే మరియు మంత్రి అంబటి రాంబాబుకు రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని బొర్రా స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టీ సాంబశివరావు, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు, బత్తుల కేశవ సత్తెనపల్లి మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, రాజుపాలెం మండల అధ్యక్షుడు తోట నరసయ్య, ముప్పాళ్ళ మండల అధ్యక్షుడు సిరిగిరి పవన్ కుమర్, నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి, సత్తెనపల్లి ఏడవ వార్డు కౌన్సిలర్ రంగిసెట్టీ సుమన్, ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు బత్తుల కేశవ తదితర జనసేన నాయకులు.