ధ్వజ స్తంభం స్థాపన కార్యక్రమంలో పాల్గొన్న బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం, ముప్పాళ్ళ మండలంలోని దమ్మాలపాడు గ్రామంలో గురువారం శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి గుడి ధ్వజ స్తంభం మరియు వివిధ దేవతల విగ్రహాల ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి మండల అధ్యక్షుడు సిరిగిరి పవన్ కుమార్ ఆహ్వానం మేరకు, గ్రామస్తుల మరియు జనసైనికుల ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా సత్తెనపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆలయ పూజారులు ప్రత్యేక పూజ నిర్వహించి బొర్రా వెంకట అప్పారావు ను ఆశీర్వదించడం జరిగినది. అనంతరం ఆలయ కమిటి సభ్యులు అప్పారావు గారిని శాలువాతో సత్కరించడం జరిగింది. ఆలయ అభివృద్ధికి 25,002 రూపాయలు విరాళంగా గుడి ధర్మకర్త సిరిగిరి రాజు మరియు సిరిగిరి పవన్ కుమార్ కి అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దమ్మాలపాడు గ్రామ ప్రెసిడెంట్ కుమ్మరి ఏడుకొండలు, కామర్తి వెంకటేశ్వర్లు (బుజ్జి), మండల ప్రధాన కార్యదర్శి నల్లపనేని రత్తయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, రూరల్ మండల అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వర, ఏడో వార్డు కౌన్సిలర్ సుమన్, బత్తుల కేశవ, సిరిగిరి రాజు, సిరిగిరి ప్రసాద్, ఆది నాగరాజు, కుమ్మరి నాగరాజు, సిరిగిరి సూర్యనారాయణ, పాతూరి పెద్ద వెంకటరావు, గంధం శివయ్య, కుమ్మరి గంగయ్య, రుద్రజడ బుల్లబ్బాయి, కుమ్మరి బుల్లయ్య, మైనార్టీ నాయకులు జాన్ ఫిరా, చిలకా సత్యం, జనసేన నాయకులు, గ్రామ జనసైనికులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.