జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న బొర్రా

సత్తెనపల్లి: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా సత్తెనపల్లి మండలం దూళిపాళ్ళ గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి, అనంతరం జయహో బీసీ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త బొర్రా వెంకట అప్పారావు, తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లి ఇంచార్జ్ కన్నా లక్ష్మి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా బొర్రా మాట్లాడుతూ.. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని భావించి రాజకీయ పార్టీ స్థాపించిన నాయకుడు ఎన్టిఅర్. ఈ తరపు యుగ పురుషుడు ఎన్టిఆర్. నీతి నిజాయితీ కష్టాన్ని నమ్మిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎన్టీఆర్. బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించే చారిత్రాత్మిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మహా వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన భౌతికంగా దూరమైన ఆయనను ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ ఆయన వర్థంతిని జరుపుకుంటూ నివాళులు అర్పించుకోవడం ధన్యతగా భావిస్తున్నాం. జయహో బీసీ సభనుద్దేశించి బొర్రా మాట్లాడుతూ. బీసీలంతా ఐక్యతతో మెలిగి ఉంటారు. జనసేన -తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తరువాత బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తాం. ఈ ప్రభుత్వంలో బీసీల ప్రాధాన్యత లేకుండా చేశారు. పేరుకే కార్పొరేషన్ పదవులు, కాళీ కుర్చీలు, కార్యాలయాలు లేని కార్పొరేషన్ చైర్మన్లు. బీసీలకు అండగా జనసేన పార్టీ ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, సత్తనపల్లి రూరల్ అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరావు, నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి, ముప్పాళ్ళ మండల అధ్యక్షుడు సిరిగిరి పవన్, టీడీపీ బీసీ నాయకులు. వెంకటకోటయ్య, తాడిబోయిన చంద్రశేఖర్, జనసేన నాయకులు. చిలక పూర్ణ, తదితర జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.