అధికారులూ.. జరభద్రం

  • ఐఎఎస్ లే ఇంటికి పోతున్నారు?
  • చిరు ఉద్యోగులు నిబంధనల ప్రకారం నడుచుకోకపైతే ఇక అంతే సంగతులు
  • దొంగ ఓట్లపై ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి: దొంగ ఓట్లను ప్రోత్సహిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. గురువారం ఆయన తిరుపతిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొంగ ఓట్లను ప్రోత్సహించిన ఐఎఎస్ అధికారులే ఎన్నికల సంఘం నుంచి తప్పించుకోలేకపోతున్నారన్నారు. ఇక చిరు ఉద్యోగులైన బిఎల్వోల పరిస్థితి ఏంటో అర్థం చేస్కోవాలన్నారు. 2019లో ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు నమ్మి ఓట్లు వేశారన్నారు. ఎన్నికలకు ముందు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలు అయిపోగానే కనపడకుండా వెళ్లిపోయారన్నారు. ధనం, దౌర్జన్యం, దొంగ ఓట్లను నమ్ముకొని మళ్లీ అధికారంలోకి రావాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. అధికారులను అడ్డం పెట్టుకొని దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారన్నారు. కానీ ఎన్నికల సంఘం డేగ కన్ను ముందు ఎవరూ తప్పించుకోలేరన్నారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఒక ఐఎఎస్ అధికారి డేటా నుంచి 30 వేల ఎపిక్ కార్డులను డౌన్ లోడ్ చేసినట్టు రుజువు కావడంతో ఆ ఐఎఎస్ అధికారిని సస్పెండ్ చేశారన్నారు. అయితే ఆ అధికారి పై ఒత్తిడి చేసిన ఏ రాజకీయ నాయకుడు కూడా ఇప్పుడు కాపాడలేకపోతున్నారన్నారు. తిరుపతి నియోజకవర్గంలో దొంగ ఓట్లపై సాక్ష్యాధారాలు సేకరించామన్నారు. వీటిపై కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. తిరుపతిలో దొంగ ఓట్లతోనే అధికార పార్టీ గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా జనసేన, టిడిపి ఉమ్మడి అభ్యర్థి గెలుపు ఖాయమన్నారు.