పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ కు స్పోర్ట్స్ కిట్స్ అందించిన బొర్రా

పల్నాడు జిల్లా, సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామానికి చెందిన లింగిశెట్టి నాగేశ్వరరావు స్టేట్ లెవెల్ లో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీలలో ఉత్తమ ప్రతిభను కనబరచి, పవర్ లిఫ్టింగ్ జూనియర్ విభాగంలో రెండు గోల్డ్ మెడల్స్, సీనియర్ పవర్ లిఫ్టింగ్ విభాగంలో రెండు సిల్వర్ మెడల్స్ సాధించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ సత్తనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు లింగిశెట్టి నాగేశ్వరావును అభినందించి, పవర్ లిఫ్టింగ్ కు అవసరమైన స్పోర్ట్స్ కిట్స్ అతనికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బొర్రాను శాలువాతో ఘనంగా సన్మానించిన పవర్ లిఫ్టింగ్ విజేత లింగిశెట్టి నాగేశ్వరావు. బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ.. యువత క్రీడల్లో రాణించి, తమ భవిష్యత్తును బంగారు బాటలు వేసుకునే విధంగా ఉండాలని, క్రీడల్లో ఒక లక్ష్యం ఏర్పరచుకొని ఆ లక్ష్యాన్ని చేరుకొనే విధంగా ఉండాలని, క్రీడలను సద్వినియోగం చేసుకునే యువతీ, యువకులకు మంచి భవిష్యత్ ఉంటుందని, క్రీడల్లో రాణించే విధంగా జనసేన పార్టీ క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సత్తెనపల్లి రూరల్ మండల అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరరావు, కోచ్ పసుపులేటి సురేష్, జయంత్, రవికిరణ్, సాయి కృష్ణ, మణి, నరసయ్య తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.