జనసైనికునికి అండగా నిలచిన బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం: నకరికల్లు మండలం, చాగల్లు గ్రామానికి చెందిన జనసైనికుడు బైక్ యాక్సిడెంట్ కు గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ విషయాన్ని చాగల్లు గ్రామ జనసేన పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న నకరికల్లు మండల అధ్యక్షురాలు లక్ష్మీ శ్రీనివాస్ తక్షణమే స్పందించి సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావుకు తెలియజేయగా.. ఆదివారం చాగల్లు గ్రామంలోని గాయపడ్డ జనసైనికుడి ఇంటికి వెళ్లి అతడిని పరామర్శించి, జనసేన పార్టీ తరఫున 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగినది. భవిష్యత్తులో కూడా జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేసి, బైక్ ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలని దాని వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నకరికల్లు మండల ప్రెసిడెంట్ తాడువాయి లక్ష్మి శ్రీనివాస్, మండల వైస్ ప్రెసిడెంట్ షేక్ రఫీ, మండల కార్యదర్శి కొండలు, శ్రీను, చాగల్లు గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.