ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలి: కటికం అంకారావు

గుంటూరు, ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కటికం అంకారావు కోరారు. చెత్తపన్ను, ఆస్తిపన్ను, పెట్రోల్ పైఅధిక వ్యాట్ తో పాటు,విద్యుత్ చార్జీలతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని, ఆయన మండిపడ్డారు. పాదయాత్ర సమయంలో 200 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీగా ఇస్తామన్న హామీ ఏమైందని, ఆయన ప్రశ్నించారు. వైసిపి అధికారం చేపట్టిన మూడు సంవత్సరాల్లో సుమారు ఏడు సార్లు కరెంటు చార్జీలు పెంచారని,ఆయన తెలిపారు.ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి,ప్రజలకు కరెంట్ షాక్ కొట్టే విధంగా, పరిపాలనను కొనసాగిస్తున్నారని, ఆయన ఎద్దేవా చేశారు. ఫ్యాన్ కి ఓటు వేసినందుకు, ఇంట్లో ఫ్యాన్ తిరగకుండా చేస్తున్నా, మీ ప్రభుత్వంపై,ప్రజల తిరుగుబాటు తప్పదని, ఆయన అన్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలను, తగ్గించేవరకు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ప్రజల పక్షాన నిలుస్తుందని, ఆయన తెలిపారు.