ఇనిమెట్ల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న బొర్రా

పల్నాడు జిల్లా, సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు ప్రధానంగా మురుగు కాలువల సమస్య వాటి వలన వచ్చే దోమల సమస్య ఈ ఎండాకాలం తీవ్రంగా మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, ఎండాకాలం మొదలుకాగానే బోర్లు అన్నీ ఎండిపోయి నీటి సమస్య తీవ్రంగా ఉందని, మేము ఒక వర్గం వారిమి అని మా బజార్ కి సీసీ రోడ్డు కూడా వేయకుండా మమ్మల్ని మట్టి రోడ్లో, బురద రోడ్డులో నడిపిస్తూ వారు పైశాచిక ఆనందం పొందుతున్నారని గ్రామస్తులు బొర్రా వెంకట అప్పారావు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ నేను కూడా మీలో ఒకడిని, మీ పొరుగునే ఉండే ధూళిపాళ్ళ వాడిని, గ్రామాల్లో ఉండే సమస్యలు తెలిసిన వాడిని, సమస్యల పరిష్కార దిశగా మనమందరం కలిసి ముందుకు వెళ్దామని మనమందరం కలిసి స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కరించుకుందామని రేపు ప్రభుత్వ అధికారం వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చేద్దాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరరావు, నగరికల్ మండలం అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి, ఏడవ వార్డు కౌన్సిలర్ రంగశెట్టి సుమన్, చిలక పూర్ణ, షేక్ కాసిం, పోకల శ్రీను, పారా రవి, కూరపాటి రమేష్, కూరపాటి రఘురాం, తాటినేని కిట్టయ్య, హరీష్ వినకొండ శ్రీను, మున్నంగి మురళి, అమరేశ్వరి, వెంకాయమ్మ, నాగమల్లేశ్వరి, కంభంపాటి విజయ, మున్నంగి సునీత తదితర నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.