బ్రదర్ కంగ్రాట్స్.. అఖిల్ పై చరణ్ ప్రశంసలు

అక్కినేని అఖిల్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీనితో వసూళ్ల పరంగా కూడా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాపై సినీ స్టార్స్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాపై ట్వీట్ చేశారు. అఖిల్ పై ప్రశంసలు కురిపించారు. బ్రదర్ అని పిలుస్తూ… సినిమా సక్సెస్ పై సంతోషం వ్యక్తం చేశారు. పూజ హెగ్డే నటన అద్భుతం అంటూ చెప్పుకొచ్చారు. గీతా ఆర్ట్స్ కి మరియు బొమ్మరిల్లు భాస్కర్ కి కంగ్రాట్స్ అంటూ చెప్తూ ఈ చిత్రాన్ని మేము బాగా ఎంజాయ్ చేశాం అంటూ పేర్కొన్నారు.