సభలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన బుగ్గన

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశం కొనసాగుతోంది. 2021-22 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ. 2,29,779.27 కోట్లతో ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ అంచనాలను రూపొందించినట్లు బుగ్గన తెలిపారు. ఈ బడ్జెట్‌లో వెనుకబడిన కులాలకు రూ.28,237 కోట్లు కేటాయించామన్నారు. 2020-21తో పోలిస్తే వారికి 32 శాతం అధికంగా కేటాయింపులు చేసినట్లు చెప్పారు. చిన్నారుల సంక్షేమానికి రూ. 16,748 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో కొవిడ్‌ నియంత్రణ చర్యల కోసం రూ.1000కోట్ల కేటాయింపులు చేశారు.

కేటాయింపులు ఇలా..

ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు

కాపుల సంక్షేమం కోసం 3,306 కోట్లు

బ్రహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు

ఎస్సీ సబ్‌ ప్లాన్‌కు రూ.17,403 కోట్లు

ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు రూ. 6,131 కోట్లు

మైనార్టీ యాక్షన్‌ ప్లాన్‌ కింద రూ.3,840.72 కోట్లు

మైనార్టీ సబ్‌ ప్లాన్‌ రూ.1,756కోట్లు

చిన్నారుల కోసం రూ. 16,748 కోట్లు

మహిళాభివృద్ధికి రూ. 47, 283 కోట్లు

వ్యవసాయ పథకాలకు రూ.11,210 కోట్లు

విద్యా పథకాలకు రూ. 24,624 కోట్లు

ఆరోగ్య రంగానికి రూ.13,830 కోట్లు

విద్యుత్‌ రంగానికి రూ.6,637 కోట్లు

కొవిడ్‌పై పోరాటానికి రూ.1000 కోట్లు

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకకు రూ.17,000కోట్లు

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు 8,727 కోట్లు

రోడ్లు భవనాల శాఖకు రూ. 7,594 కోట్లు

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణకు రూ.1,556 కోట్లు

వైఎస్సార్‌ రైతు భరోసా రూ.3,845 కోట్లు

జగనన్న విద్యా దీవెన రూ.2,500కోట్లు

జగనన్న వసతి దీవెన రూ.2,223.15 కోట్లు

పీఎం ఫసల్‌ బీమా యోజనకు రూ.1,802 కోట్లు

డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.865కోట్లు

జగనన్న చేదోడుకు రూ.300కోట్లు

వైఎస్సార్‌ వాహనమిత్రకు రూ.285కోట్లు

వైఎస్సార్‌ మత్స్యకార భరోసాకు రూ.120 కోట్లు

అర్చకుల ప్రోత్సాహకాలకు రూ .120కోట్లు

ఇమామ్స్‌, మౌజంల ప్రోత్సాహకాలకు రూ.80కోట్లు

పాస్టర్ల ప్రోత్సాహకాలకు రూ.40కోట్లు

ల్యాండ్ రీ సర్వే కోసం రూ.206 కోట్ల