సల్మాన్‌ ‘రాధే’ మూవీ పై బన్నీఆసక్తికర ట్వీట్

బాలీవుడ్‌ స్టార్‌హీరో సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా నటించిన ‘రాధే’ కోసం తాను ఎదురుచూస్తున్నట్లు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌ తెలిపారు. ‘డీజే’లో అల్లుఅర్జున్‌ స్టెప్పులేసిన ‘సీటీమార్‌’ను తాజాగా సల్మాన్‌ తన సినిమా ‘రాధే’ కోసం రీ క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగు ‘సీటీమార్‌’లో బన్నీ డ్యాన్స్‌, స్టైల్‌ తనకెంతో నచ్చిందని సల్మాన్‌ ఓ ట్వీట్‌ పెట్టారు.

కాగా, తాజాగా సల్మాన్‌ ట్వీట్‌పై అల్లు అర్జున్‌ స్పందించారు. ‘థ్యాంక్యూ సో మచ్‌ సల్మాన్‌ గారు. మీ నుంచి ప్రశంసలు అందుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. ఎంతోమంది అభిమానులతో కలిసి వెండితెరపై ‘రాధే’ మేజిక్‌ చూడాలని మీకోసం సీటీమార్‌ చేయాలని అనుకుంటున్నాను. మీరు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు’ అని బన్నీ పేర్కొన్నారు.