‘మోసగాళ్లు’ టీజర్‌ని రిలీజ్ చేసిన బన్నీ

గత కొంతకాలంగా పరాజయాలతో సతమతమవుతున్న మంచు విష్ణు.. భారీ స్కామ్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి థ్రిల్ చేయబోతున్నారు. ‘మోసగాళ్లు’ పేరుతో విలక్షణ కథను రూపొందిస్తున్నారు. ఈ మూవీలో హీరోగా నటిస్తూ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై  నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు మంచు విష్ణు. కాజల్ అగర్వాల్ ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తోంది. చరిత్రలో అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ మిస్టరీని కథాంశంగా తీసుకొని హాలీవుడ్-ఇండియన్ మూవీగా ఈ సినిమాను రూపొందిస్తుండటం విశేషం. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ పోస్టర్స్ మోసగాళ్లపై అంచనాలు నెలకొల్పగా.. తాజాగా టీజర్ రిలీజ్ చేసి ఆ అంచనాలకు రెక్కలు కట్టింది చిత్రయూనిట్.

నేడు ఈ చిత్ర ప్రమోషన్ కు బన్నీ ముందు కొచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ని స్టైలిష్ స్టార్ బన్నీ రిలీజ్ చేశారు. `మోసగాళ్లు` టీజర్‌ని రిలీజ్ చేసిన బన్నీ టీమ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన థీమ్ మ్యూజిక్‌ని విక్టరీ వెంకటేష్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

31 నిమిషాల పాటు సాగే ఈ టీజర్‌ ముందు స్కామ్‌కి పాల్పడిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదలబోనని ట్రంప్ హెచ్చరిస్తున్న వీడియోతో మొదలైంది. ఆ తరువాత స్క్రాప్ బ్యాచ్ స్కామ్‌కి సంబంధించిన డబ్బుని బస్తాల్లో కూర్చి స్క్రాప్ ప్లేస్‌లో పెట్టడం.. అక్కడికి మంచు విష్ణ, కాజల్ కలిసి వెళ్లి ఇది సరిపోతుందిగా అని కాజల్ అంటే ఆటి ఇప్పుడే మొదలైందని విష్ణు చెబుతున్న డైలాగ్స్ సినిమా ఏంటనేది స్పష్టం చేస్తోంది. అయితే మేకింగ్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పై మరింత శ్రద్ధ తీసుకుని వుంటే బాగుండేది. ఇందులో మంచు విష్ణుకి కాజల్ అగర్వాల్ చెల్లెలుగా నటిస్తోంది. సునీల్‌శెట్టి, రుహీసింగ్‌, పవదీప్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.