జనసేన బలోపేతానికి ఇంటింటి జనసేన

*కరపత్రాలను అందజేసిన జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య

సిద్ధవటం: కులమతాలకు అతీతమైన పార్టీ జనసేన పార్టీ అని జనసేన రాష్ట్ర చేనేత వికాస రాష్ట్ర కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మల్లిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు.. ఇంటింటికి జనసేన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం సిద్ధవటం మండల పరిధిలోని ఉప్పరపల్లె గ్రామంలో ఇంటింటికి తిరిగి సమావేశమై ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని.. జనసేన పార్టీ రూపొందించిన మేనిఫెస్టో కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ..పేద బడుగు బలహీన మధ్య తరగతి కుటుంబాల అభివృద్దే ధ్యేయంగా జనసేన పార్టీ కృషి చేస్తుందన్నారు. రానున్న 2024ఎన్నికల్లో జనసేనను ఆదరించాలన్నారు. వైఎస్ఆర్సిపి అరాచక పాలనను ప్రజలు దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, జనసేన వీర మహిళలు పాల్గొన్నారు.