బల్లిపర్రులో జనసేన ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పెడన నియోజకవర్గం: భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం మొత్తం స్వాతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది. ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం స్వాతంత్రం ఎందరో బలిదానాలతో సాధించుకున్న స్వాతంత్ర దినోత్సవాన్ని త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి మహనీయులను స్మరించుకోవడం భారతీయ పౌరులుగా మన బాధ్యత. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పెడన మండలం, బల్లిపర్రు గ్రామంలో గ్రామస్తులు మరియు జనసేన ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్ వి బాబు, జోగి నాగ వరలక్ష్మి, జోగి రమణ, వాసన కుమారస్వామి, ఊస వెంకయ్య, చీరల నవీన్ కృష్ణ, ముదినేని రామకృష్ణ, ఊస రామాంజనేయులు, అర్జునపూడి సత్యనారాయణ, సమ్మెట కృష్ణ, వాసన పరమేశ్వరరావు, మురాల లక్ష్మణ, బత్తున నరేష్, ఎర్రంశెట్టి వీరబాబు, పిన్నిశెట్టి రాజు, కొక్కు రమేష్, మరియు బల్లిపర్రు జనసైనికులు పాల్గొన్నారు.