నిర్బంధాలతో ప్రశ్నించే గొంతుకలను ఆపగలరా చిన్న దొరా!!

  • కల్వకుంట్ల తారక రామారావు జగిత్యాల జిల్లా పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులు

తెలంగాణ, జగిత్యాల: పట్టణ మరియు రూరల్ పోలీస్ స్టేషన్లలో జనసేన జగిత్యాల ఇంఛార్జి బెక్కం జనార్ధన్ మరియు మండల నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి చిన్న దొర పర్యటన సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వుండడానికి ముందస్తు అరెస్ట్ అని వివరణ ఇస్తున్న తెలంగాణ భా రా స పార్టీ ఫ్రెండ్లీ పోలీస్. గడిచిన ఆరు నెలలుగా ప్రభుత్వం చేసిన అవినీతి రహిత పథకాలను ఎండగడుతూ ప్రతి నిత్యం జనం సమస్యలు తెలుసుకుంటూ సమస్య తీవ్రతను బట్టి సంబంధిత అధికారులను ప్రశ్నిస్తున్న బెక్కం జనార్ధన్ మరియు మండల నాయకులు టౌన్ నాయకులు. ఈ ప్రశ్నించే విధానం నచ్చని కల్వకుంట్ల కుటుంబం నియంత పాలన దిశగా ముందుకు వెళ్తుంది. గడిచిన వారం రోజుల్లో జనసేన పార్టీ బరిలో ఉంది అని తెలిసినప్పటి నుండి నియోజక వర్గ నాయకులకు బెదిరింపు, పోలీస్ వ్యవస్థను అక్రమ విషయాలకు వాడుకుంటున్న కల్వకుంట్ల పాలనకు చరమ గీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి. జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశం సామాన్యునికి అందుబాటులో విద్య వైద్యం న్యాయం అవి అందే వరకు మీ అవినీతి పాలనను ఎండగడుతూనే ఉంటుంది జనసేన.