ఎమ్మెల్సీ ఎన్నికలలో కులాల విభజన: గంధంశెట్టి

రైల్వే కోడూరు: మార్చి నెల 13వ తేదీన జరగబోయే పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా వైసిపి పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు ఓటర్లకు కులాల వారీగా విభజించే పనిలో ఉన్నామని మీ యొక్క కులం ఏమిటో చెప్పమని ఫోన్ చేసి మరీ అడుగుతున్నారని జనసేన పార్టీ రైల్వేకోడూరు నాయకులు గంధంశెట్టి దినకర్ బాబు ఆరోపించారు. ఈ సందర్భంగా దినకర బాబు మాట్లాడుతూ కులాల విభజన ప్రకారంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి తద్వారా ఓట్లు రాబట్టాలని వైసిపి అభిప్రాయంగా అర్థమవుతుందని దీనిని పూర్తిగా ఖండిస్తున్నామని తెలియజేశారు. ఎన్నికలలో కులవిభజన, మత విభజన ఆధారంగా ఓటర్లను ప్రలోభ పెట్టడం నేరమైన కారణంగా దీనిపైన ఎన్నికల విభాగం చర్యలు తీసుకోవాలని జనసేన తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. అలాగే జనసేన పార్టీ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో అఫీషియల్ గా ఎవరికి మద్దతు ఇంతవరకు తెలియజేయలేదని ఈ సందర్భంగా తెలిపారు.