టీడీపీ యువనేతల ఆధ్వర్యంలో సీబీఎన్ జన్మదిన వేడుకలు

  • 74కేజీల భారీ కేక్ కటింగ్ తో అదరగొట్టిన తెలుగు తమ్ముళ్లు
  • చరిత్రను తిరగరాసిన మహానేత నారా చంద్రబాబు నాయుడు
  • ముప్పాళ్ల వెంకటచౌదరి – మర్రిపాడు ఏప్రిల్ అభయం జిల్లా బ్యూరో ఇంచార్జి ఆదిరెడ్డి

మర్రిపాడు మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి విగ్రహం వద్దతెలుగు జాతి ముద్దు బిడ్డ, తెలుగుదేశం పార్టీ రధ సారధి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదిన శుభ సందర్భంగా ముప్పాళ్ల వెంకట చౌదరి, మాలపాటి వెంకటేశ్వర్లు నాయుడు ఆధ్వర్యంలో ముఖ్య అతిధులుగా విచ్చేసిన సర్పంచ్ షేక్ బీబీజన్, వైస్ సర్పంచ్ గంగవరపు చెన్నపనాయుడు,మాజి సర్పంచ్ బాణం వెంకటేశ్వర్లు అధ్యక్షతన 74కేజీల భారీ కేకును కట్ చేసి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు వేడుకలు ఘనంగా నిర్వహించారు. భానసంచా పేల్చి తమ అభిమానాన్ని ఆకాశమే హద్దుగా చూపించారు. ఈ సందర్భంగా వారిరువురూ మాట్లాడుతూ ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని అ మహానేత చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల మనోకీర్తిని పెంచిన మహానుభావుడు అని రాజకీయ రంగంలో తనదైన శైలిలో ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన నిస్వార్థ రాజకీయ నాయకుడని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని అటువంటి మహానుభావుడి జన్మదిన వేడుకలు అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందని మహానేత చంద్రబాబు నాయుడి ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముప్పాళ్ల వెంకట చౌదరి, మాలపాటి వెంకటేశ్వర్లు నాయుడు, సర్పంచ్ షేక్ బీబీజన్, వైస్ సర్పంచ్ గంగవరపు చెన్నపనాయుడు, జనసేన మండల కన్వీనర్ ఓరుగంటి ప్రమీల, మాజి సర్పంచ్ బాణం వెంకటేశ్వర్లు, గంగినేని కొండలరావు, గంగినేని శ్రీనివాసులు, మద్దిపాటి రవి, గంగినేని ప్రసాద్ జనసేన నాయకులు పెనుమాది నరసింహ గంటా అంజి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.