శుక్రవారం జరిగే మన్యం బంద్ జయప్రదం చేయండి: జనసేన మురళి

మన్యం జిల్లా, శుక్రవారం నాడు జరిగే మన్యం బంద్ జయప్రదం చేయండని జనసేన మురళి పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా జనసేన మురళి మాట్లాడుతు ప్రతీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ మూకుమ్మడిగా సెలవులు పెట్టి రావాలని కోరుచున్నాము. మరియు ప్రతీ ఆదివాసీ మేధావులు, పెద్దలు, ప్రజలు, మహిళలు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, యువత స్వచ్చందంగా బాధ్యతగా రావాలి అని కోరుచున్నాము. ఇది మన ఆత్మ గౌరవంతో కూడుకున్న విషయం. ఈ విషయం చాలా పెద్దది. 50 లక్షల మంది బోయ వాల్మీకిలు మనలో కలుస్తే మన పిల్లలకు విద్యా, ఉద్యోగాలు, రాయితీ, ఉపాధి, రాజకీయం అన్నీ కూడా అందని ద్రాక్ష వలె ఉంటుంది. కాబట్టి దీన్ని తిప్పి కొట్టాలంటే పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా మనం అనే ఆదివాసీలు అందరం ఒకే తాటి పై వచ్చి మన వాణీ వినిపిద్ధాం. ఐక్య పోరాటాలు చేద్దాం. కాబట్టి అన్ని పార్టీలలో ఉన్న, అన్ని సంఘాలలో ఉన్న ఆదివాసీలు అందరూ 31 న జరిగే మన్యం బంద్ కు మద్దతు తెలిపి విజయ వంతం చేద్దాం.మనం అందరం ముందుగా ఆదివాసీలం. కాబట్టి ఇక్కడ ఆదివాసీలకు మాత్రమే అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఏ పార్టీలో ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా ఒక ఆదివాసీగా మన ఉనికిని మన అస్తిత్వాన్ని, మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలి. మన ఆదివాసీల సత్తా ఏంటో ఈ పాలకులకు తెలియజేయాలి. కాబట్టి ప్రతీ ఉద్యోగి ప్రతీ ఉపాధ్యాయుడు వారు పనిచేస్తున్న గ్రామాల నుండి మహిళలను, విద్యార్థులను, ప్రజలను, పెద్దలను, యువతను ఆటోల ద్వారా వ్యాన్ల ద్వారా మండల హెడ్ క్వార్టర్స్ కు తీసుకుని రాగాలరు. వారిని ఆ గ్రామాలలో ఉన్న టీచర్స్ షేర్ చేసుకుని స్వచ్చందంగా తీసుకుని రాగలరు. ఇది మన జాతి సమస్య.కాబట్టి ప్రతీ ఒక్కరం మన వంతు బాధ్యతగా అందరం షేర్ చేసుకుందాము. మనం వెనకడుగు వేస్తే సర్వం కోల్పోతాము. అంతా అయ్యాక ఆకులు పట్టుకుంటే లాభం ఉండదు. కాబట్టి నా ఆదివాసీ బంధువులారా ఆలోచించండి! ప్రతీ ఒక్కరికీ మనకు జరుగుతున్న అన్యాయం గురించి తెలియజేద్దాము. మనకు ఇప్పుడు పార్టీలు, సంఘాలు ముఖ్యం కాదు. జాతి ముఖ్యం. కాబట్టి మనలో ఉన్న ఇగోలు అన్నీ పక్కన పెత్తి జాతి కోసం పోరాటాలు చేద్దాం. రండి వేలదిగా తరలి రండి. మనకు జరిగే అన్యాయాన్ని ఎండగడదాం. ఆదివాసీలు అంటే గొర్రెలు కాదు బెబ్బులి పులులు అని చాటి చెబుదాం. అనంతగిరి జనసేన పార్టీ మండల అధ్యక్షులు సి ఎస్ మురళి తెలిపారు.