జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుక

నందిగామ, భారత రాజ్యాంగ నిర్మాత, పేద, బడుగు, బలహీన, నిమ్న వర్గ ప్రజల దైవం, ఆధునిక భారత పితామహుడు కీర్తి శేషులు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి సందర్బంగా నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక గాంధీ సెంటర్ లో గల అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నమస్కరించి జయ జయ ధ్వానాలు పలికినారు. అనంతరం మీడియా పాయింట్ లో అంబేద్కర్ కలలు కన్న బహుజన రాజ్యాధికార ఆవశ్యకత, దాని స్థాపనకై పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఏర్పాటై పాటుపడుతున్న జనసేన పార్టీకి బహుజనులు ప్రజలు పట్టం కట్టి డబ్బుకు, మద్యానికి ప్రజలను బానిసలను చేస్తున్న పెట్టుబడి దారీ బూర్జువాల పార్టీలను తరిమి కొట్టాలని అదే అంబేద్కర్ కి ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోకవర్గ పార్టీ నాయకులు పూజారి రాజేష్, తెప్పలి కోటేశ్వరరావు, వీరమహిళ శ్రీమతి తోటకూర పద్మావతి, తాటి నరేంద్ర మరియు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.