అత్తిలి జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘననివాళి

తణుకు, డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్బంగా తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం అత్తిలి గ్రామంలో తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచద్రారావు అధ్యక్షతన అత్తిలి మండలం పార్టీ అధ్యక్షులు దాసం ప్రసాద్ ఆధ్వర్యంలో అత్తిలిలో పెద్దపేటలో గల అంబేద్కర్ విగ్రహానికి మరియు అత్తిలి బస్టాండ్ సెంటర్ లో గల అంబేద్కర్ విగ్రహానికి మరియు అత్తిలిలో గల జనసేన పార్టీ ఆఫీసు నందు ఉన్న అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి వందనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అత్తిలి గ్రామ ప్రెసిడెంట్ గంటా విజేత, గంటా నాగరాజు, పశ్చిమగోదావరి జిల్లా పార్టీ కార్యదర్శి వన్నెం విశ్వప్రభు , ఉభయగోదావరి జిల్లాల వీరమహిళల రీజినల్ కోఆర్డినేటర్ కాట్నం విశాలి, అత్తిలి ఎంపీటీసీ సభ్యులు కూసంపూడి గీత, బుద్దాల రాంబాబు మరియు పంచాయతీ వార్డ్ మెంబెర్స్ అయ్యల దివ్య, ఈడూరు రాంబాబు మరియు వంగ వెంకటేశ్వరరావు, జవ్వాది రాంప్రసాద్, అత్తిలి జనసేన నాయకులు, జనసైనికులు, వీరామహిళలు తదితరులు పాల్గొన్నారు. మరియు తణుకు మండలం తణుకు టౌన్ మున్సిపల్ ఆఫీసు దగ్గర గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వందనం చేసినారు. ఈ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ విడివాడ రామచంద్రరావు తణుకు టౌన్ పార్టీ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్ మరియు జనసేన పార్టీనాయకులు పంతం నానాజీ, సుంకర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.