పిఎఫ్‌ ఖాతాదారులకు ఝలక్‌: నూతన విధివిధానాలను ప్రకటించిన కేంద్రం

పిఎఫ్‌ ఖాతాల్లో ఎక్కువ డబ్బులు దాచుకుందామనుకునే వారికి కేంద్రం ఝలక్‌ ఇచ్చింది. ఈ మేరకు కొత్త నిబంధనలను మోడీ సర్కార్‌ వెల్లడించింది. ఈ నిబంధన ప్రకారం ప్రస్తుతం ఉన్న ప్రావిడెంట్‌ ఫండ్‌ (పిఎఫ్‌) ఖాతాలు రెండు వేర్వేరు ఖాతాలుగా విభజించబడతాయి. తద్వారా ఏటా ఇపిఎఫ్‌ ఆదాయం రూ. 2.5 లక్షల దాటిన ఉద్యోగల నుండి పన్ను విధించేందుకు కేంద్రానికి సులభతరం అవుతుంది. ఈ మేరకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ (సిబిడిటి) నియమాలను జారీ చేసింది. పిఎఫ్‌ ఖాతాల్లో ప్రత్యేక ఖాతాలు నిర్వహించబడతాయి. ఇప్పుడు ప్రస్తుత ఉద్యోగుల పిఎఫ్‌ ఖాతాలన్నీ పన్ను పరిధిలోకి వచ్చేవి… పన్ను పరిధిలోనికి రానివిగా విభజించబడతాయి. ఈ ఏడాది మార్చి 31 లోపు పిఎఫ్‌ ఖాతాలో పడిన డబ్బు పన్ను రహితంగా ఉంటుంది. ఆ తర్వాత కాంట్రిబ్యూషన్‌ మీద రెండు పిఎఫ్‌ ఖాతాలపై విడివిడిగా వడ్డీ లెక్కిస్తారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుండి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. 2021-22 పిఎఫ్‌ ఖాతాలో రూ.2.5 లక్షల కన్నా ఎక్కువ సేవ్‌ చేస్తే మొత్తంపై వచ్చే వడ్డీకి వినియోగదారుడు, ఉద్యోగ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.