జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కేంద్ర ప్రభుత్వం జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలి

  • ప్రజాదరణని చూసి ఓర్వలేకనే, ప్రభుత్వ అవినీతి ప్రశ్నిస్తున్నందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర పన్నుతుంది.
  • పవన్ కళ్యాణ్ కి ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని జనసైనికుల్లో ఆందోళన
  • పవన్ కళ్యాణ్ ప్రాణం కోట్లాది అట్టడుగు, పేద, బహుజన వర్గాలకి ఎంతో ముఖ్యం
  • పవన్ కళ్యాణ్ పై ఈగ వాలిన ముఖ్యమంత్రి జగన్ దే బాధ్యత

ఉమ్మడి వరంగల్ జిల్లా, నర్సంపేట నియోజకవర్గం, ఇటీవల జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర పన్నుతున్నారని కేంద్ర నిఘా వర్గాల వద్ద ఆధారాలు లభించినట్లు పవన్ హత్యకు 250 కోట్లు సుఫారి చేతులు మారినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ నాయకుడు మేరుగు శివ కోటీ యాదవ్ స్పందిస్తూ… కేంద్రం ప్రభుత్వం వెంటనే తమ ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ కి జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలని నర్సంపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేశారు. అలాగే ఈరోజు ఆంద్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రజాదరణ చూసి ఓర్వలేకనే వారి అవినీతి, వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకు పవన్ కళ్యాణ్ పై కక్ష కట్టి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ కి ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని జనసైనికులు ఆందోళన చెందుతున్నారని పవన్ కళ్యాణ్ పై ఈగ వాలినా ముఖ్యమంత్రి జగన్ దే బాధ్యత అని తెలిపారు. అలాగే తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రాణం కోట్లాది అట్టడుగు, పేద, బహుజన వర్గాలకి ఎంతో ముఖ్యం అని కావున కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పవన్ కళ్యాణ్ కి జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ముఖ్య నాయకులు వంగ మధు, ఓర్సు రాజేందర్, చాగంటి క్రాంతి, గంగుల రంజిత్, రాపోలు సురేష్, అందె రంజిత్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.