గాజు గ్లాస్ తో చాయ్ – చాయ్ తో చర్చ కార్యక్రమంలో తంబళ్ళపల్లి రమాదేవి

నందిగామ నియోజకవర్గం: నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలం హెడ్ క్వార్టర్స్ లో గాజు గ్లాస్ తో చాయ్ – చాయ్ తో చర్చ కార్యక్రమంలో పాల్గొన్న నందిగామ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి. చందర్లపాడు మండలంలోని భవన నిర్మాణ కార్మికులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి జనసేన పార్టీ సింబల్ అయినటువంటి గాజు గ్లాసుతో ఛాయ్ ఇచ్చి వారి యొక్క కష్టాలను సాధక బాధలను వారితో పంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల వారి కష్టాలను వింటుంటే నా గుండె కలిచి వేసిందన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటినుండి సిమెంట్ రేట్లు పెంచి, ఇసుక పాలసీలను తెచ్చి భవన నిర్మాణ కార్మికుల జీవితాలను అగమ్య గోచరంగా మార్చేశారు. ఇక్కడ వీరికి పనులు లేక పక్క రాష్ట్రాలకు వలస పోతున్నారు. కనీసం సంక్షేమ పథకాలు కూడా వీరికి అందడం లేదు. ప్రమాదవశాత్తు మరణించిన భవన నిర్మాణ కార్మికులకు ఎటువంటి భీమ కూడా కల్పించలేని ఈ ప్రభుత్వంకి ప్రజలు బుద్ధి చెప్పనున్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్డీలు సుధాకర్, కుడుపుగంటి రాము, జనసేన నాయకులు జనసైనికులు, వీర మహిళలు, టిడిపి నాయకులు, టిడిపి కార్యకర్తలు, భవననిర్మాణ కార్మిక సంఘం సభ్యులు పాల్గొనడం జరిగింది.