పాయకరావుపేట జనసేన ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

పాయకరావుపేట: కార్మిక దినోత్సవం సందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గంలో జనసేన నాయకులు గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో.. యువనాయకులు గెడ్డం ఆకాష్, చైతన్య చేతుల మీదుగా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఎండ తీవ్రతని దృష్టిలో ఉంచుకుని ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం వలన పాయకరావుపేట ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.