ఛలో అసెంబ్లీ పోస్టర్ ఆవిష్కరణ

గుంటూరు విజ్ఞాన మందిరంలో బుధవారం సాయంత్రం జరిగిన రెల్లి, మాదిగ రాష్ట్ర నాయకుల సమావేశంలో మున్సిపల్ కార్మికుల ఉద్యోగ భద్రత కొరకు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ మరియు రాష్ట్ర రెల్లి సంఘం నాయకులు సోమి ఉదయ్ కుమార్, విజయవాడ నుండి తుపాకుల రవణమ్మ, దానాల శ్రీనివాస్, తెనాలి నుండి రాఘవేంద్ర ఈ సమావేశంలో పాల్గొని ఛలో అసెంబ్లీ పోస్టర్ ను ఆవిష్కరించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాడు రాష్ట్రవ్యాప్తంగా మిగతా కార్మిక సంఘాలను కలుపుకొని ఉద్యోగ భద్రత కొరకు అసెంబ్లీ ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని తీర్మానించడం జరిగిందని వైసిపి మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పిన జగన్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కార్మికులందరూ ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేసి కార్మిక సత్తా చాటాలని రాష్ట్ర దళిత నాయకులు తెలిపారు.