అల్లుడు అదుర్స్‌ లో బిగ్‌బాస్ బ్యూటీకి ఛాన్స్‌

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 లో ప్రత్యేకమైన కంటెస్టెంట్‌ ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా మోనాల్‌ గజ్జర్‌ అనడంలో సందేహం లేదు. ఆమె ఒక బ్రహ్మ పదార్థం మాదిరిగా ప్రేక్షకులకు తోచింది. ఎన్ని సార్లు నామినేషన్ లోకి వచ్చినా కూడా బిగ్‌ బాస్ ప్రేక్షకులు ఆమెకు ఓట్లు వేయలేదు.అయినా కూడా ఆమె సేవ్‌ అవుతూ వచ్చింది. ఎన్నో సార్లు మోనాల్ సేవ్‌ అవ్వడం ప్రేక్షకులందరికి కూడా ఆశ్చర్యం వేసింది. మోనాల్‌ సేవ్‌ అవుతూ రావడంతో నిర్వాహకులు ఏదో చేస్తున్నారేమో అని, తెర వెనుక ఏదో జరుగుతుందేమో అంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి. 14 వారాలు కొనసాగిన ఆమె అందరిని ఆశ్చర్య పర్చింది. బయటకు వచ్చిన తర్వాత ఆమె బిజీ బిజీగా గడిపేస్తోంది. బిగ్‌ బాస్‌ వల్ల ఆమెకు క్రేజ్‌ బాగా పెరిగింది.అందుకే ఆమెకు సినిమాల్లో మరియు బుల్లి తెరపై ఆఫర్లు వస్తున్నాయి. బుల్లి తెరపై వరుసగా వస్తున్న ఆఫర్ల కారణంగా ఆమెకు వెండి తెర ఆఫర్లు కూడా తలుపు తడుతున్నాయి.

తాజాగా బెల్లం కొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న అల్లుడు అదుర్స్‌ సినిమాలో ఐటెం సాంగ్‌ చేసే అవకాశం ఈమెకు వచ్చింది. ఈ ఆఫర్ తో తెలుగులో ఈ అమ్మడు రీ ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. రికార్డు స్థాయిలో ఈ సినిమా కోసం నిర్మాతలు ఖర్చు పెడుతున్నారు.సినిమాలోని ఐటెం సాంగ్‌ ను చాలా ప్రత్యేకంగా ప్లాన్‌ చేయాలని దర్శకుడు చాలా రోజులుగా చర్చలు జరుపుతున్నాడు. తాజాగా బిగ్‌ బాస్ క్రేజ్ తో యమ దూకుడు మీదున్న ఈ అమ్మడు అయితే ఖచ్చితంగా తెలుగులో అందరిని ఆకర్షించే అవకాశం ఉంటుందనే ఉద్దేశ్యంతో అల్లుడు అదుర్స్‌ సినిమా కోసం ఆమెను ఐటెంగా ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి.