టీడీపీ, జనసేన సంయుక్త ఆధ్వర్యంలో చంద్రన్న షూరిటీ భవిష్యత్తుకి గ్యారెంటీ

రంపచోడవరం నియోజకవర్గం: రంపచోడవరం మండలం, ముసురుమిల్లి పంచాయితీ మసురుమిల్లి గ్రామంలో చంద్రన్న ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం మండల అధ్యక్షులు కారం సురేష్ బాబు అధ్వర్యంలో రంపచోడవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి వంతల రాజేశ్వరి, శీతం శెట్టి వెంకటేశ్వరావు, జనసేన టీడీపీ ఉమ్మడి కార్యక్రమాల నియోజకవర్గం అధ్యక్షులు కుర్లా రాజశేఖరరెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పెంటపాటి అనంత మోహన్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గోర్లే సునీత, తెలుగు యువత అధ్యక్షులు సిద్దా వెంకన్న దొర, గ్రామ కమిటీ అధ్యక్షులు కొండపల్లి వెంకటలక్ష్మి, యూనిట్ ఇంఛార్జి కుంజం బాపన్న దొర, జనసేన నాయకులు జనసేన గంగవరం మండల అధ్యక్షులు కుంజాం సిద్దు, ఆకుల జయరామ్, కొనతం శ్రినివాసు టీడీపీ బూత్ ఇంఛార్జి వెంకటేష్ తదితర కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.