బొప్పాయితో కరోనాకు చెక్‌..

గ‌త ఏడాది చైనాలో పుట్టుకొచ్చిన ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్ కంటికి క‌నిపించ‌కుండా. ప్ర‌పంచ‌దేశాలు క‌మ్మేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే రోజురోజుకు ల‌క్ష‌ల మంది ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. తాజాగా క‌రోనా స్ట్రెయిన్‌ కూడా మొదలైంది. మ‌రోవైపు క‌రోనా వ్యాక్సిన్ క‌నుగొనేందుకు ప్ర‌పంచ‌దేశాల శాస్త్ర‌వేత్త‌లు తీవ్ర ప్ర‌య‌త్నం చేస్తున్నా ఇప్ప‌టివ‌ర‌కు స‌రైన ఫ‌లితం ద‌క్క‌లేదు.

 అయితే క‌రోనా నుంచి ర‌క్షించుకోవాలంటే రోగ‌నిరోధ‌కశ‌క్తి ఎక్కువ‌గా ఉండాలి.  వైద్యులు కూడా రోగ‌నిరోధ‌కశ‌క్తి పెంచుకోవ‌డానికి పౌష్టికాహారం తీసుకోమ‌ని ఎప్ప‌టిక‌ప్పు సూచ‌న‌లు చేస్తూనే ఉన్నారు. దీంతో ప్ర‌జ‌లు ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. అయితే రోగ‌నిరోధ‌కశ‌క్తి పెంచ‌డంలో బొప్పాయి స‌హాయ‌ప‌డుతుంది.

బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్క‌లంగా ఉండ‌డం వ‌ల్ల‌ రోగనిరోధకశక్తి పెరిగి. వైరస్‌ల నుంచి ర‌క్షిస్తుంది. అలాగే బొప్పాయిని తరచూ తీసుకోవడం వల్ల‌ జలుబు, ఫ్లూ మరియు ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ ను కలిగించే బాక్టీరియాను అరికట్టేందుకు తోడ్పడుతుంది. అదేవిధంగా, బొప్పాయిలో సమృద్ధిగా ఉండే పొటాషియం హైబీపీని కంట్రోల్ చేస్తుంది.

గుండె ఆరోగ్యానికి కూడా బొప్పాయి ఎంతో మంచిది. ఎందుకంటే.బొప్పాయిలో ఫైబర్, పొటాషియం మరియు విటమిన్ కంటెంట్ లు అధికంగా ఉంటాయి. ఇవి గుండె జ‌బ్బుల‌ను నివారిస్తాయి. అయితే ఆరోగ్యానికి మంచిది క‌దా అని. బొప్పాయిని ఎక్కువ‌గా మాత్రం తీసుకోకూడ‌దు. ఎందుకంటే ఈ పండు జీర్ణం కావ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది.