ఛలో మచిలీపట్నం కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన చేగొండి సూర్య ప్రకాష్

ఆచంట, ఈ నెల 14 వ తేదీన మచిలీపట్నంలో జరగనున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకగా ఛలో మచిలీపట్నం కార్యక్రమం విజయవంతం చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ఆచంట నియోజకవర్గం ఇంచార్జ్ చేగొండి సూర్య ప్రకాష్ పిలుపునిచ్చారు. శుక్రవారం మార్టేరులో వరాహ నరసింహస్వామి కళ్యాణ మండపంలో నిర్వహించిన నియోజకవర్గం జనసేన పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షుడు కోయె వెంకట కార్తీక్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సూర్య ప్రకాష్ గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా జనసైనికులకు దిశా నిర్దేశం చేసారు. మండలంలోని జనసైనికులు, వీర మహిళలకు కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ మండలం అధ్యక్షులు కొండవీటి శ్రీనివాస్, ఆచంట మండల అధ్యక్షులు జవ్వాది బాలాజీ, జిల్లా ఉపాధ్యక్షులు వెంగలదాసు దానయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి షేక్ ముంతాజ్ బేగం, జిల్లా సంయుక్త కార్యదర్శి రావి హరీష్, ఆచంట మండల వైస్ ఎంపీపీ ఎర్రగొప్పుల నాగరాజు, కార్యనిర్వహణ కమిటీ సభ్యుడు తోట సురేంద్ర, సీనియర్ నాయకులు, గ్రామ అధ్యక్షులు, ఎంపీటీసీలు జనసేన నాయకులు, క్రియాశీలక వాలంటీర్స్, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.