చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జనంకోసం జనసేన

  • ధృతరాష్ట్రుడి పరిపాలనకు చరమగీతం పాడాలి
  • ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన వైసీపీ ప్రభుత్వం
  • మద్యనిషేధం పై మాట తప్పారు
  • జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ ధ్వజం

నెల్లూరు, రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలనలో పూర్తిస్థాయిలో వైఫల్యం చెంది ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందని, ధృతరాష్ట్రుడి పరిపాలనకు చరమగీతం పాడాలని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ ధ్వజమెత్తారు నెల్లూరు నగరంలోని ఏడవ డివిజన్ నవాబ్ పేటలో జనసేన జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జనంకోసం జనసేన గడపగడపకు కార్యక్రమంలో భాగంగా ఆమె శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఎన్నికల్లో అనేక మోసపూరితమైన వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మద్యపాన నిషేధ హామీని నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా మద్యం షాపులు ఏర్పాటు చేశారని సామాన్య మధ్యతరగతి కుటుంబాల జీవన పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయన్నారు. ప్రజలపై మోయలేని భారాలు మోపారని, వైసిపి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం నేర్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. పేద ప్రజలకు పక్కా గృహాలు నిర్మిస్తామని చెప్పిన వైసిపి ఆచరణలో మాత్రం దాన్ని నిలబెట్టుకోలేదన్నారు యువతకు ఉపాధి అవకాశాలు లేవని అనేక మంది యువత ఉద్యోగాలు లేక వారి భవిష్యత్తు అంధకారంగా మారిందన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జనసేనకు ఒక అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్న ఈ కార్యక్రమంలో జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, కొట్టే వెంకటేశ్వర్లు సుందర్రామిరెడ్డి, అలియా తదితరులు పాల్గొన్నారు.