గ్రామ సభలో అధికారులను నిలదీసిన శ్రీమతి వినుత కోటా

రేణిగుంట మేజర్ పంచాయతీలో గ్రామసభ పంచాయతీ అధికారులు నిర్వహించడం జరిగింది. రేణిగుంట వాసిగా జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ఈ గ్రామ సభకి హాజరు అయ్యి రేణిగుంట ప్రజల సమస్యలను ప్రస్తావించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీమతి వినుత కొన్ని సమస్యలు ప్రస్తావించారు. పంచాయతీ అధికారులు బాధ్యతా రహిత్యంగా ఈ సభ నిర్వహించటం, అనధికారులను(అధికార పార్టీ నాయకులను) అధికారుల స్థానంలో పక్కన కూర్చుని పెట్టుకుని పంచాయతీ రాజ్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ గ్రామసభను నిర్వహించారు. ప్రజలు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పలేని ఈఓ ఎందుకు గ్రామసభ నిర్వహించారో తెలియదు. గ్రామసభ నిర్వహించే ముందు సమస్యలను వినగలిగే సంబంధిత అధికారులు లేరు, ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి వారి దగ్గర ఎలాంటి సమాచారం లేదు, ప్రశ్నలు అడిగిన వారికి అడ్డదిడ్డంగా మా దగ్గర సమాచారం లేదు, రిపోర్ట్ లు తయారు చేయలేదు, రిపోర్టులు లేవు అని బాధ్యతారాహిత్యంగా మౌనంగా పంచాయతీ ఈఓ ఉండడం జరిగింది. సమగ్ర సమాచారం, రిపోర్ట్, ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేనపుడు గ్రామ సభను ఎందుకు నిర్వహిస్తున్నట్టు అని!! ఏమి అభివృధి కార్యక్రమాలు చేశారు అని ప్రజలు అడిగితే సమాధానం చెప్పడానికి రిపోర్ట్ లేదు. దేని దేనికి ఎంత నిధులు ఖర్చు పెట్టారు ? సమాధానం: రిపోర్ట్ లేదు. ఇలా ఏ ప్రశ్న అడిగినా దాటవేసే ప్రయత్నాలు చేస్తూ, 10 గంటలకు గ్రామసభ అని ప్రజలకి చెప్పి అధికారులు 11 గంటలకు వచ్చి, 12.15 గంటలకల్లా ప్రజలకు తగిన సమయం మాట్లాడడానికి ఇవ్వకుండా, హుటా హుటిన సభ ముగిసింది అని చెప్పడం జరిగింది. ఈ చర్యలు అన్నింటిపై జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని జనసేన తరుపున శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా డిమాండ్ చేశారు.