జనసేనలోనే రిటైర్మెంట్ తీసుకుంటా జె.ఎస్.పి గ్లోబల్ టీం జూమ్ సమావేశంలో చిలకం మధుసూదన్ రెడ్డి

జె.ఎస్.పి గ్లోబల్ టీం ఆధ్వర్యంలో సురేష్ వరికూటి అధ్యక్షతన జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ధర్మవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డితో శనివారం జె.ఎస్.పి గ్లోబల్ టీం జూమ్ సమావేశం నిర్వహించడం జరిగింది. తమ తమ దేశాల నుండి ఒక్కొక్కరిగా సేవలు అందించడం కంటే అందరూ సంఘటితమై ప్రపంచ వ్యాప్తంగా అన్ని టీంలు కలిసి ఒక్క టీంగా వెళ్ళాలి అనే ముఖ్య లక్ష్యంతో ఏర్పడినటువంటి “జె.ఎస్.పి గ్లోబల్ టీం” నుండి వివిధ దేశాలకు చెందిన ఎన్నారై జనసేన నాయకులు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నటువంటి జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ధర్మవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డితో వివిధ నియోజకవర్గాలకు చెందిన ఎన్నారై జనసేన నాయకులు తమ తమ నియోజకవర్గాలలోని సమస్యలపై చర్చించడం జరిగింది. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ… ఎన్నారై జనసేన నాయకులు పార్టీ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడడం జరిగింది. పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టినటువంటి ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలని పార్టీని మరింత బలోపేతం చేయడంలో అందరూ సహకరించాలని కోరడం జరిగింది. అధినేత నిర్ణయాలను గౌరవిస్తూ… పార్టీ కార్యక్రమాలను బలంగా క్షేత్ర స్థాయిలో తీసుకెళ్ళేందుకు నా సాయిశక్తులా కృషి చేస్తానని, జనసేనలోనే రిటైర్మెంట్ తీసుకుంటానని, తుది శ్వాశ వరకు జనసేన పార్టీలోనే కొనసాగుతానని చెప్పడం జరిగింది. ధర్మవరం నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీ బలోపేతం కోసం సేవ్ ధర్మవరం అనే కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని అన్నారు. పార్టీ ఆదేశానుసారం పార్టీ తలపెట్టే కార్యక్రమాలను ప్రజలలోకి బలంగా తీసుకెళ్ళాలని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో అణువైన ప్రాంతమని, ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రణాళికను రూపొందిస్తున్నారని తెలిపారు. అనంతపురం నుండి అభివృద్ధి లేక ఎంతో మంది యువత వలసపోతున్నారని వలసలను అరికట్టేందుకు జనసేనాని కృషి చేస్తున్నారని తెలిపారు. అన్ని దేశాల జనసేన నాయకులతో కో ఆర్డినేట్ చేసుకుని ఈ సమావేశాన్ని అద్భుతంగా నిర్వహించిన నిర్వాహకులను పలువురు ప్రశంసించడం జరిగింది.