ప్రజల దాహార్తిని తీర్చిన చింతలమోరి సర్పంచ్

కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, వేసవికాలం కారణంగా గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి ఎద్దడికి జనసేన నాయకులు మరియు చింతలమోరి సర్పంచ్ డా. రాపాక రమేష్ బాబు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల దాహార్తిని తీరుస్తున్న డా. రాపాక రమేష్ బాబుకి చింతలమోరి ప్రజలు ధన్యవాదములు తెలపడం జరిగింది.