లాలుపురం జనసేన ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ

గుంటూరు, లాలుపురం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎటుకురు బైపాస్ ఆంజనేయస్వామి బొమ్మ దగ్గర మరియు మిర్చియార్డు వై జుంక్షన్ దగ్గర ఉచిత మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నాయుబ్ కమల్, జిల్లా ఉపాధ్యక్షుడు అడపా మాణిక్యాలరావు, ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, టౌన్ ప్రెసిడెంట్ నెరేళ్ల సురేష్, 16 వ వార్డ్ కార్పొరేటర్ దాసరి లక్ష్మీ, జిల్లా సంయుక్త కార్యదర్శి చట్టాల త్రినాద్, జనసేన నాయకులు కాటూరి శ్రీనివాసరావు, దామరచెర్ల పవన్, రామంజి, వెంకటేష్, శివ, ఉమ, తులసి, రాము, కృష్ణ, ఆదురీ శివయ్య, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.