చిరంజీవి గారు ఒక శిఖరం తెలుసుకోండి నారాయణ గారు: ఎస్ వి బాబు

వయసుతోపాటు మన బుద్ధి పరిణితి చెందాలి. సుదీర్ఘ ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులైతే ప్రతి మాటని ఆచితూచే మాట్లాడాలి.

కానీ సిపిఐ నారాయణ గారు ఇంత వయసొచ్చినా మాట్లాడే విధానం నేర్చుకోకపోవడం దురదృష్టకరం. మీ వయసును గౌరవించే మిమ్మల్ని ఘాటుగా విమర్శించలేకపోతున్నాం.

గాంధీ జయంతి రోజున చికెన్ తిన్నావ్, క్షమాపణ చెప్పావ్, అకారణంగా చిరంజీవి గారిని నిందించావు, సిగ్గు లేకుండా దండంతో సరి అంటూ దండాలు పెడుతున్నావ్, ఎవరికైనా వయసు వస్తే జ్ఞానం పెరుగుతుంది. కానీ నారాయణ కి బుద్ధి మందగించి మందబుద్ధి మాటలు మాట్లాడుతున్నాడు.

ఇంతే ఓటుడంతై అన్నట్లు, చిన్న స్థాయి నుండి అంచలంచెలుగా ఎదిగి మహా శిఖరమై, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మెగాస్టార్ అయ్యాడు. సమాజం పట్ల అంకితభావం కల వ్యక్తిగా అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేశారు.

రాజకీయంలో మచ్చలేని మనిషిలా, స్వచ్ఛమైన రాజకీయ నాయకుడిలా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో చిరంజీవి గారి పేరు స్థిరస్థాయిగా నిలిచిపోతుంది.